175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా?

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు.

అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలుతో 2021 సంవత్సరంలో నిర్మాణం పూర్తీ చేసుకొని భక్తులకు ఆంజనేయుస్వామి దర్శనమిస్తున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత దేశంలోనే ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహంగా నమోదయింది.ఈ విగ్రహాన్ని నిర్మాణానికి పునాది 30 అడుగుల లోతు మట్టిని త్రవ్వి కాంక్రీట్ తో నిర్మించారు. ఈ విగ్రహం నిర్మాణ దశలో ఉన్నపుడు హూద్ హూద్ తుఫాను వచ్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పరంజిను ధ్వంసం చేసింది.

విశాఖ టూర్ వెళ్లేవారికి షాకింగ్ న్యూస్... ఇక ఆ టూరిస్ట్ అట్రాక్షన్ లేనట్టే

కానీ విగ్రహనికిఎటువంటి నష్టం జరగలేదు. తరువాత కొంత కాలం పనికి తాత్కాలికంగా నిలిపివేశారు. బుచ్చిపెట గ్రామం శేషుగరు హూద్ హూద్ తుఫాను తరువాత ఆగిపోయిన విగ్రహ నిర్మాణం పనులు ఆయన ఆధ్వర్యంలో వివిధ దాతలు సహకారంతో 2021 నాటికి పూర్తి చేసారు. ఈ అభయాంజనేయస్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం విశేషం పూజలు జరుగుతాయి.

---- Polls module would be displayed here ----

గుడ్ న్యూస్... హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో రైలు

విగ్రహ వార్షికోత్సవం, హనుమాన్ జయంతిని పెద్ద ఎత్తున్న జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరు తరలి వచ్చి అభయాంజనేయస్వామి దర్శించుకుంటారు ఈ సమయంలో అభ్యంజనేయస్వామి దేవస్థానం వారు హోమాలు, పుష్ప అభిషేకాలు అన్నదానం కార్యక్రమాలు జరుపుతారు.

2024-05-03T11:04:06Z dg43tfdfdgfd