CURRY LEAVES FOR FACE: మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఈ ఆకులను తప్పకుండా ఉపయోగించండి..!

Curry Leaves For Skin Pigmentation: వేసవికాలంలో చాలా మంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీని కోసం మందులు, ప్రోడెక్ట్స్‌, క్రీములు ఉపయోగిస్తారు. అయితే ఈ చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కరివేపాకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే కొన్ని ఆరోగ్యకరమైన పోషకాలు చర్మాని ఎంతో కాంతివంతంగా, మొటమలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. 

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ ఆకులు చర్మానికి కూడా సహాయపడుతాయి. ఇది స్టెయిన్ మచ్చలను కూడా తలగిస్తుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఈ కరివేపాకు సహాయపడుతుంది. కరివేపాకు హైడ్రేటింగ్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి చర్మానికి ఎంతో సహాయపడుతుంది. 

అయితే మీరు కాంతివంతమైన, ఆరోగ్యకరమైన చర్మాని పొందాలి అనుకుంటే ఈ ఆకులతో ఫేస్‌ ప్యాక్‌ చేయవచ్చు. దీని కోసం మీరు కరివేపాకులను ఉడికించుకోవాలి. ఇది చల్లరిన తరువాత పేస్ట్‌లో పెరుగు, తేనెను కలుపుకోవాలి. దీనిని ముఖం మీద ఇరువై నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ను రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి. 

కరివేపాకు నీటితో కూడా మీరు ఆరోగ్యకరమైన చర్మాని పొందవచ్చు. దీని కోసం మీరు కరివేపాకు ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడికించుకోవాల్సి ఉంటుంది. నీటిని చల్లబరుచుకోవాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని కడగుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ నీళ్ళును టోనర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది. 

మీరు అవసరం అవుతే శనగపిండి, నిమ్మకాయ రసం ఈ నీటిలో కలపవచ్చు. దీనిని ఫేస్‌ ప్యాక్‌ చేయవచ్చు. ఇరువై నిమిషాల పాటు ఈ ఫేస్‌ ప్యాక్‌ను ఉపయోగిస్తే కాంతివంతమైన చర్మం కలుగుతుంది.

ఫేస్‌ ప్యాక్‌ ఉపయోగించే అప్పుడు చిట్కాలు: 

సున్నితమైన చర్మం ఉన్నవారు ప్యాక్ లో నిమ్మరసం వాడకుండా ఉండటం మంచిది.

ప్యాక్ ను ముఖంపై అప్లై చేసే ముందు, మీ మోచేయి లోపలి భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.

ప్యాక్ ను ఎక్కువసేపు ముఖంపై ఉంచవద్దు, ఎందుకంటే ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది.

ప్యాక్ ను అప్లై చేసిన తర్వాత, ముఖంపై మాయిశ్చరైజర్ రాసుకోండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-23T09:07:54Z dg43tfdfdgfd