HAIR OIL : వారానికి ఎన్నిసార్లు రాస్తేజుట్టు పొడుగ్గా పెరగుతుంది..

Hair Oil : జుట్టు ఆరోగ్యానికి నూనె చాలా మంచిది. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Hair Oil : జుట్టు సంరక్షణలో హెయిర్ ఆయిల్ అప్లై చేయడం చాలా మంచిది. వారానికి రెండు సార్లు జుట్టుకి నూనె రాయడం మంచిది. దీని వల్ల జిడ్డుగా అనిపిస్తుంది. ఆ టైమ్‌లోనే దుమ్ము, మలినాల వంటి కణాల జుట్టుకి తలకి అంటుకుంటాయి. ఇవి చర్మ రంధ్రాల ద్వారా చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. కాబట్టి, నూనె రాసినా ఎక్కువ సమయం ఉండకూడదు. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇది చాలా ముఖ్యం. తలకి నూనె..

నూనెలు సహజంగానే తేమని అందిస్తాయి. వీటిని చర్మానికి రాయడం వల్ల మృదువుగా, మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. ఈ నూనెని రాయడం జుట్టు డ్రైగా కాకుండా జుట్టు మూలాల నుండి బలంగా మారుతాయి. జుట్టు మూలాలకి పోషణని అందించి జుట్టు పెరుగుదలకి పోషకాలను అందిస్తుంది. దీనిని రాయడం వల్ల తేమని అందించి స్కాల్ప్ పొడిబారకుండా ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చర్మ రంధ్రాల నుండి తేమ కోల్పోకుండా కాపాడుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించే హెయిర్ మాస్క్..​ ​

జుట్టు పెరగడం..

ఏదైనా స్కాల్ప్ ఆయిల్ రాస్తే జుట్టు చిక్కుబడకుండా ఉంటుంది. అలాగే జుట్టు మందంగా మారుతుంది. మెరుస్తుంది. జుట్టుని దువ్వడం, అల్లడం కూడా ఈజీ అవుతుంది. తలకి నూనె రాస్తే తేమ కోల్పోకుండా ఉంటుంది. దీంతో జుట్టు బలంగా పొడుగ్గా, ఆరోగ్యంగా మారుతుంది. ఈ లక్షణాలతో జుట్టు అందాన్ని పెంచుతుంది. ​Also Read : పాదాల నలుపు తగ్గి తెల్లగా మెరవాలంటే ఇలా చేయండి..

ఒత్తిడి తగ్గేందుకు..

జుట్టుకి నూనె రాయడం వల్ల హెల్దీగా మారుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. హెయిర్ ఆయిల్ రాస్తే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించి స్కాల్ప్, హెయిర్ క్యూటికల్స్‌ని బలంగా చేస్తాయి.

చుండ్రుని తగ్గిస్తుంది..

చుండ్రుకి ప్రధాన కారణం తలలో తేమ లేకపోవడం. కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా చుండ్రు పెరుగుతుంది. దీని వల్ల స్కిన్ ఇరిటేషన్ పెరగకుండా జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి. కాబట్టి, తగినంత నూనె రాయడం మంచిది. ​Also Read : రోజ్‌మేరీ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట..

జుట్టు బలహీనమవ్వడం..

జుట్టు రాలడానికి ప్రధాన కారణం జుట్టు బలహీనమవ్వడం. తగినంత పోషకాహారం ఉన్నప్పటికీ, రక్తసరఫరా లేకపోతే, జుట్టు కుదుళ్లు క్షీణిస్తుంది. నూనెని జుట్టు మూలాలని నూనె మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. నూనెలోని పోషకాలు జుట్టుకి బలాన్నిస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకి సాయపడుతుంది. కాబట్టి, జుట్టుకి వారానికి రెండు సార్లైనా నూనె రాయడం మంచిది. ఓ రెండుగంటల పాటు ఉండి తలస్నానం చేయండి. అంతకుమించి ఓ రాత్రంతా ఉండి మరుసటి రోజు తలస్నానం చేయడం మంచిదని గుర్తుపెట్టుకోండి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T08:16:48Z dg43tfdfdgfd