RAGI FLOUR PUNGULA: రాగి పిండి పునుగుల రెసిపీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం..

Ragi Flour Pungula Recipe: రాగి పిండిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి అది మన శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతే కాకుండా ఇందులో లభించే ఐరన్ ఎముకలను బలంగా చేసేందుకు శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అది పిండి లో ఉండే ఫైబర్ గుణాలు జీర్ణ క్రియను శక్తివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి అందుకే ఈ మధ్యకాలం రాగి పిండి వినియోగం విచ్చలవిడిగా పెరిగింది నిజానికి రాగి పిండితో తయారు చేసిన వంటలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన పోషకాలతో పాటు వందేళ్ల ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది రాగి పిండితో వివిధ రకాల వెరైటీస్ వంటకాలు చేసుకుంటున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో పునుగులు ఒకటి. నిజానికి పెసరపప్పుతో కాకుండా రాగి పిండి తో తయారు చేసిన పునుగులే చాలా బాగుంటాయట. సాయంత్రం పూట పిల్లలకు వీటిని స్నాక్స్ గా ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం ఇచ్చినవారవుతారు. అయితే ఈ రాగి పునుగుల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పునుగులకు కావలసిన పదార్థాలు:

ఒక కప్పు దోశలు వేసుకునే పిండి

ఒక చిన్న కప్పు రాగి పిండి

టీ స్పూన్ జీలకర్ర

ఒక చిన్న కప్పు జరిగిన ఉల్లిపాయలు

ఒక చిన్న కప్పు తరిగిన కొత్తిమీర

ఒక చిన్న కప్పు జరిగిన పచ్చి మిర్చి

చిన్నగా తురుముకున్న ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు

కావలసినంత ఉప్పు

తయారీ విధానం:

ముందుగా ఈ రాగి పునుగులను తయారు చేసేందుకు ఒక చిన్న గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది అందులో కావాల్సినంత దోశ పిండి వేసుకొని.. ఇదే పిండిలో కావలసినంత రాగి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పునుగుల పిండిలా మెత్తగా మిశ్రమంలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే తురిమి పెట్టుకున్న పదార్థాలన్నీ వేసుకొని.. మరోసారి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. 

స్టవ్ పై పునుగుల గిన్నెను పెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా నూనె రాస్తూ వాటిని బాగా వేడి చేసి కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో పునుగుల్లా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించి పునుగులు ఎరుపు రంగులోకి మారేంతవరకు అటు ఇటు వేయించుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అన్ని ఇలానే చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా రాగి పిండితో తయారు చేసిన పునుగులు రెడీ అయినట్లే.. అయితే ఈ పునుగులను వేడివేడిగా పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ తో తింటే భలే ఉంటుంది. ఈ పునుగుల పిండిని కలుపుకునే క్రమంలో నీటికి బదులుగా మజ్జిగను కలిపి కూడా పిండిని తయారు చేసుకోవచ్చు. ఇలా మజ్జిగను కలుపుకుంటే పునుగుల రుచి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-23T15:53:54Z dg43tfdfdgfd