కర్పూరం వాసన చూస్తే ఏమౌతుందో తెలుసా?

కర్పూరాన్ని ఎక్కువగా దేవుడి పూజలో వెలిగిస్తుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కర్పూరాన్ని వాసన చూడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?

కర్పూరం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను చంపుతాయి. అందుకే కర్పూరం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తారు. నిపుణుల ప్రకారం.. కర్పూరం వాసన చూస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అసలు కర్పూరం వాసన చూడటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జలుబు

కర్పూరాన్ని వాసన చూస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు కర్పూరం వాసన చూస్తు జలుబు తగ్గుతుంది.  ముక్కు నుంచి గాలి తీసుకోవడానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 

మైగ్రేన్ ఉపశమనం

కర్పూరం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కర్పూరం వాసన చూస్తే తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు ఇట్టే తగ్గిపోతుంది. ఇందుకోసం కర్పూరాన్ని రోజూ కాసేపు చేతి రుమాలులో ఉంచి వాసన చూడాలి. దీనివల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. కానీ మనం అనుకున్నంత చిన్న సమస్యలైతే కావు. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఒత్తిడి, యాంగ్జైటీకి గురయ్యే వారు కర్పూరం వాసన చూడటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. కర్పూరం వాసన చూస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కర్పూరం వాసన ఒత్తిడిని తగ్గించి మనసును శాంతపరుస్తుంది.

 

మెరుగైన జీర్ణక్రియ 

కర్పూరం వాసన జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కర్పూరం వాసన చూస్తే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం మలబద్దకం సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది.

 

అలసట నుంచి ఉపశమనం

కర్పూరం మిమ్మల్ని అలసట, బలహీనతల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు కర్పూరం వాసన చూడటం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఇది మన శరీరాన్ని, మనసును శాంతపరుస్తుంది.

రోగనిరోధక శక్తి

ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉంటే మీరు ఎణ్నో అంటువ్యాధులు, రోగాల బారిన పడతారు. అయితే కర్పూరాన్ని వాసన చూడటం వల్ల శరీర రోగనిరోధక శక్తి  మెరుగుపడుతుంది. కర్పూరం వాసన చూడటం వల్ల ఎన్నో వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 

నోటి పూతల నుంచి ఉపశమనం

కర్పూరం వాసన నోటి పూతల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనివల్ల కర్పూరం నాసికా గొట్టం ద్వారా నోరు, చెవుల సిరలకు వ్యాపించి అల్సర్ల సమస్యను తొలగిస్తుంది.

2024-05-04T04:32:34Z dg43tfdfdgfd