పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్

పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్

స్కూల్ కు వెళ్లేటప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఇష్టం వచ్చిన వంటలు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెడుతారు.   గుడ్డు, చికెన్, మటన్ ఇలా ఫిష్ రకరకాల వంటు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తారు. అయితే  రాజస్థాన్ లో లేటెస్ట్ గా  స్కూల్ పిల్లలకు  గుడ్లు, నాన్ వెజ్ టిఫిన్ బాక్సుల్లో  పెట్టొద్దని స్కూల్ యాజమాన్యం ఆదేశాలివ్వడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

మే 1న జైపూర్‌లోని మహారాజా సవాయ్ మాన్ సింగ్ విద్యాలయ యాజమాన్యం  పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు లేదా నాన్ వెజ్ పదార్థాలను  అనుమతించబోమని తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు.   ఈ మెసేజ్ స్క్రీన్ షాట్  ను  ప్రముఖ సినీ రచయిత  తన దారాబ్ ఫరూఖీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో  పోస్ట్ చేశారు. దీనిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి రూల్ పెట్టడానికి  స్కూల్ యాజమాన్యానికి ఏమైనా ప్రత్యేక  హక్కు ఉందా అని ప్రశ్నించారు.   అయితే   కొత్త మార్పులు  తీసుకొచ్చే భాగంలోనే   స్కూల్ కొత్త మేనేజ్‌మెంట్ ఈ కొత్త రూల్ ను  అమలు చేసినట్లు తెలుస్తోంది. 

 ఇండియాలో  శాఖాహారం vs మాంసాహారం చర్చ  ఇప్పటికే వివాదాస్పదంగా ఉంది.  2023 వరల్డ్ అట్లాస్ నివేదిక ప్రకారం  38% భారతీయులు శాకాహారులుగా గుర్తించారు. మరోవైపు,  2018 BBC నివేదిక మూడు   ప్రభుత్వ సర్వేల ఆధారంగా జనాభాలో కేవలం 20% మాత్రమే శాకాహారులని అంచనా వేసింది. ఇపుడు స్కూళ్లలో  నాన్‌వెజ్‌ ఫుడ్‌ను  నిషేదించడం వివాదాస్పదంగా మారింది. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఇప్పటికే  గుడ్ల పంపిణీని నిలిపివేశాయి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-03T11:34:54Z dg43tfdfdgfd