శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచే సలాడ్.. ఇలా తయారు చేసుకోండి..!

సంపూర్ణ ఆరోగ్యం కోరుకునేవారు శరీరంలో తగినంత ఎర్ర రక్తకణాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. రెడ్ బ్లడ్ సేల్స్ కౌంట్ తగ్గితే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సాధారణంగా మన రక్తంలో ఎర్ర రక్త కణాలు (Red blood cells) సుమారు 40-45% వరకు ఉంటాయి. అమెరికన్ రెడ్ క్రాస్ ప్రకారం, ఈ కణాల ప్రధాన పని ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను తీసుకొని శరీరంలోని అన్ని భాగాలకు అందించడం.

ఎర్ర రక్తకణాలు ఊపిరితిత్తులకు వ్యర్థాలను, ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి తీసుకెళ్లతాయి. లంగ్స్ ఆ వ్యర్థాలు బయటకు నెట్టివేస్తాయి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను మోసుకెళ్లగలవు. ఎందుకంటే వాటిలో "హిమోగ్లోబిన్" అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌తో కలిసి "ఆక్సిహిమోగ్లోబిన్"గా మారుతుంది, ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఈరోజు వీటిని పెంచుకునే ఒక సలాడ్ గురించి తెలుసుకుందాం.

మన శరీరం ఎర్ర రక్త కణాలను (RBCs) తయారు చేయడానికి కొన్ని ముఖ్యమైన పోషకాలను అవసరం, ఆ పోషకాలలో ఐరన్, రాగి, ఫోలేట్, విటమిన్లు A, B12, C, E ఉన్నాయి. ఇవి సమృద్ధిగా ఉండే ఆహారాలను తినడం ద్వారా రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెంచుకోవచ్చు. రీసెంట్‌గా న్యూట్రిషనిస్ట్ సోనియా నారంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సింపుల్, టేస్టీ, హెల్తీ RBC సలాడ్‌ను పంచుకున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్త కణాల సంఖ్య మెరుగుపడుతుందని ఆమె వివరించారు. భోజనం చేయడానికి 15 నిమిషాల ముందు ఈ సలాడ్ తినాలి. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.

* RBC సలాడ్ తయారీ విధానం

RBC సలాడ్ అనేది ఎర్ర రక్త కణాల (RBCs) ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిని ముల్లంగి, బీట్‌రూట్, క్యారెట్ వంటి మూడు ప్రధాన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఈ సలాడ్ తయారీ, ప్రయోజనాల గురించి న్యూట్రిషనిస్ట్ సోనియా ఇన్‌స్టాలో ఒక వీడియోను కూడా పంచుకున్నారు.

---- Polls module would be displayed here ----

ఈ సలాడ్‌ను ఈజీగా తయారు చేయవచ్చు. అందుకు సన్నగా తరిమిన బీట్‌రూట్, క్యారెట్లు, ముల్లంగి ముక్కలను ఒక పెద్ద సలాడ్ గిన్నెలోకి తీసుకోవాలి. పోషకాల స్థాయిలను, రుచులను మెరుగుపరచడానికి, కొన్ని తరిగిన కొత్తిమీర ఆకులు, చక్కగా తరిగిన పచ్చి మిరపకాయలు, దానిమ్మ గింజలు యాడ్ చేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాలు యాడ్ చేయాలి. విటమిన్లు శరీరానికి బాగా ఒంట పట్టడానికి కొద్దిగా నూనె లేదా నిమ్మరసం కూడా జోడించవచ్చు.

ఈ సలాడ్ ఎర్ర రక్త కణాలను పెంచుతుందని న్యూట్రిషనిస్ట్ సోనియా తెలిపింది. ముల్లంగి (Radish) , బీట్‌రూట్, క్యారెట్స్‌లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి -6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, ఇవి బ్లడ్ కౌంట్‌ను పెంచుతాయి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, కాలేయాన్ని డిటాక్సీపై చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.

2024-04-23T07:09:16Z dg43tfdfdgfd