Trending:


Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..

Friday Remedies: శుక్రవారంరోజున ఈ పనులు అస్సలు చేయోద్దు.. లక్ష్మీదేవికి కోపం వస్తుందంట..


White Sauce Pasta: రుచికరమైన వైట్‌ సాస్ పాస్తా తయారీ విధానం

White Sauce Pasta Recipe: వైట్ సాస్ పాస్తా ఒక రుచికరమైన సులభమైన వంటకం, ఇది ఏ సందర్భానికి సరిపోతుంది. ఇది తయారు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు.


Varuthini Ekadashi 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. ఒకసారి స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


మిరియాల గురించి ఆసక్తికర విషయాలు!

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు అస్సలు కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


Today Horoscope: ఓ రాశివారికి ఊహించని లాభాలు..!

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినపతి బుధుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రాహు) దిన ఫలం:-కోపాన్ని అదుపులో...


Pudina Pachadi: పుదీనా పచ్చడి ఆరోగ్యకరమైన వంటకం ఇలా తయారు చేసుకోండి

Pudina Pachadi Recipe: పుదీనా పచ్చడి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని తయారు చేయడం ఎంతో సులభం.


Dosakaya Kura Recipe: దోసకాయ కూర.. రుచికరమైన, సులభమైన వంటకం

Dosakaya Kura: దోసకాయ కూర ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం. ఇది తన సరళత రుచికి ప్రసిద్ధి చెందింది. దోసకాయలను ఉల్లిపాయలు, టమాటాలు, మసాలాలతో కలిపి వండుతారు. ఇది అన్నం, రొట్టె లేదా చపాతీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.


Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


బూడిద గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు!

బూడిద గుమ్మడికాయతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. బూడిద గుమ్మడికాయ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


Turmeric On Face Side Effects: ముఖానికి డైరెక్ట్ గా పసుపు రాసుకుంటే ఏమౌతుంది..? చర్మనిపుణులు ఏం చెబుతున్నారంటే

Applying Turmeric On Face Side Effects: పసుపు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందం పెంచడంలోను ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పసుపును ముఖానికి ఉపయోగించే ముందు మీరు ఈ జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


వేసవిలో మూగజీవాలకు వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక పశువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సాధారణంగా వేసవిలో వడదెబ్బ, ఢీహైడ్రేషన్ సమస్యల బారిన పడుతున్నారు. మరీ మండుతున్న ఎండల వల్ల పశువులు కూడా వడదెబ్బ కు గురవుతాయా అంటే అవుననే అంటున్నారు పశువైద్యులు. ఎండా కాలంలో వడదెబ్బతోపాటు ఇంకా ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే...


అత్తగారింట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ గొడవలు కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


మీలో ఈ లక్షణాలు ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం...

ప్రతిఒక్కరు ధనవంతులు కావాలని కోరుకుంటారు. కొందరు పుట్టుకతో మరికొందరు కష్టపడి వారి చేసే పనిని, ఆత్మ విశ్వాసాన్ని నమ్మికొని పైకి ఎదుగుతుంటారు. కానీ, ఈ 5 లక్షణాలు ఉన్నవారే ధనవంతులు అవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మొదటిది సోమరితనాన్ని వీడండి. ప్రజలు మంచి పనులు, కృషి ఆధారంగా మాత్రమే డబ్బు సంపాదించాలి, తద్వారా సంపదను అనుభవిస్తారు. మీరు ధనవంతులు కావాలంటే, మీరు సోమరితనం వదిలేసి నిరంతరం పని చేయడానికి కట్టుబడి ఉండాలి. మీరు ఏ పనిలోనైనా సోమరితనం లేకుండా...


Money Astrology: మే 4 ధన జ్యోతిష్యం.. వారిపై పనిభారం పెరుగుతుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 4వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషరాశి : వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే ఉద్యోగుల సహకారంతో సిస్టమ్ పరితీరు పరిపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పరిహారం :- వినాయకుడిని పూజించండి. వృషభం : వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కానీ అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది. పరిహారం:- హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిధున రాశి : మిధున రాశి ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అధికారులతో సరైన సమన్వయం అవసరం. ఒక ముఖ్యమైన అసైన్‌మెంట్ వస్తుంది. పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి. కర్కాటకం: ఉద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. లేకుంటే మీ వ్యాపార పద్ధతులు ఏవైనా లీక్ కావచ్చు. ప్రభుత్వపరంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒకరకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పరిహారం:- వినాయకునికి సింధూరం సమర్పించండి. సింహ రాశి: ప్రస్తుత వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టండి. విస్తరణ ప్రణాళికలు అమలు చేయడం సరికాదు. ఏదైనా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం, మొదలైన వాటికి సంబంధించిన పని విధానంపై చర్చ ఉంటుంది. ఆఫీస్‌లో మీ ఫైల్స్, డాక్యుమెంట్స్‌ అన్నీ భద్రంగా ఉంచండి. పరిహారం:- గోశాలకు దానం చేయండి. కన్య రాశి: ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పనిలో డాక్యుమెంట్ పూర్తిగా పరిశోధించండి. నెట్‌వర్కింగ్, సేల్స్ సంబంధిత వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. అకౌంట్స్ విషయంలో కూడా పారదర్శకత పాటించాలి. పరిహారం:- బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తులారాశి: వ్యాపారంలో అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కానీ సిబ్బందికి సంబంధించిన సమస్య ఉంటుంది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీడియా, ఇతర సోర్సులను ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. పరిహారం:- చీమలకు పిండి ఆహారంగా వేయాలి. వృశ్చికం: వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఎవరినీ సులభంగా నమ్మవద్దు, మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆఫీస్ పనులలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం:- జంతువులకు సేవ చేయండి. ధనుస్సు రాశి: ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది, జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు రిలేషన్‌షిప్‌లో చీలికను సృష్టిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. పరిహారం:- సరస్వతి మాతను ఆరాధించండి మకరరాశి: వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ సూత్రాలతో కొంత రాజీ పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం మీపై పడవచ్చు. పరిహారం:- శివలింగానికి అభిషేకం చేయండి కుంభ రాశి: ఏదైనా వ్యాపార నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లోని సీనియర్ వ్యక్తి సలహాలు, మార్గదర్శకాలను అనుసరించండి. ఈ సమయంలో షేర్ల వంటి రిస్క్ ఉండే మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఉద్యోగంలో వాతావరణం, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం:- భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీన రాశి: ప్రస్తుతం పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో చాలా తెలివిగా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏదైనా ముఖ్యమైన, ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ ట్రిప్ రద్దు కావడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. పరిహారం:- శ్రీసూక్తం పఠించండి.


భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు, పారిపోతే పట్టుకొచ్చి మరీ..!

ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టిన వార్తలే వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టటమో.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయయటమో ఇలాంటి సంఘటనలు చూసేవాళ్లం. కానీ.. వాటన్నింటికీ భిన్నంగా.. తన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజులు చిత్రహింసలు పెట్టిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంతగా తన భర్తను బాధపెట్టిన ఘటన ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికైనా ధనవంతులౌతారు..!

మన ప్రణాళికలను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేస్తామో... అప్పుడే మన పనుల్లో అడ్డంకులు మొదలౌతాయి. అడ్డంకి సృష్టించేవారు మన పక్కనే ఉంటారు. కాబట్టి.. చేసే పనులను రహస్యంగా ఉంచాలి. కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా ఏది మనకు దక్కినా అది ఎక్కువ కాలం నిలవదు. అదే శ్రమించి సాధించుకున్నది అయితే.. కలకలం నీ వెంటే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే.. చాణక్య నీతి ప్రకారం... మీలో కనుక ఈ కింది లక్షణాలు ఉంటే.. మీరు కచ్చితంగా జీవితంలో ఏదో ఒక సమయంలో ధనవంతులు అవుతారట. మరి...


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు కలిపి తినొద్దు!

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు అస్సలు కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


నాజూకు నడుము, ఊరిస్తున్న సొగసు.. ఈ బ్యూటీ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!

గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు శ్రద్ద దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. నాజూకు నడుము చూపిస్తూ కుర్రకారును మైకం తెప్పించింది. తన లేలేత గ్లామర్ హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది శ్రద్ద దాస్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సొగసు చూడతరమా అంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు. పైట చాటు అందాలు బయట పెడుతూ కెమెరా ముందు రొమాంటిక్ ఫోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తుండటం అమ్మడి హ్యాబీ. తాజాగా వదిలిన ఫొటోల్లో పరువాల పొంగులతో పరేషాన్ చేసేసింది. ఈ పిక్స్ చూసి యూత్ మైమరచిపోతున్నారు. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


మూత్రం దుర్వాసనకు కారణాలు ఇవే!

వాసనతో నిండి మూత్రం వివిధ సమస్యలకు సంకేతం. అదే సమయంలో మూత్రం వాసన రావడం అనేది ఇబ్బందికర విషయం. దుర్వాసనతో నిండిన మూత్రానికి కారణాలు ఇవే.


Oats Soup: ఆరోగ్యకరమైన ఓట్స్ సూప్ తయారీ విధానం

Oats Soup Recipe: ఓట్స్ సూప్ అనేది పోషకమైన సూప్. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది. బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి లక్ష్యాలకు సరిపోతుంది.


Rasi Phalalu 2-5-2024: మే 3 రాశి ఫలాలు.. వారి రిలేషన్‌ బలపడుతుంది..!

మీ ప్రస్తుత పరిస్థితిలో మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. మీరు మీ లక్ష్యాల కోసం శ్రద్ధగా పని చేస్తుంటే, మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు, ప్రతిఫలాలను ఆశించే సమయం. త్వరలో మీ జీవితంలోకి కొత్త సంబంధం రావచ్చు. ఇది రొమాంటిక్‌ రిలేషన్‌ కావచ్చు లేదా సంతోషం, సానుకూలతను తెచ్చే కొత్త స్నేహం కావచ్చు. ఈ కొత్త కనెక్షన్‌కి ఓపెన్ మైండెడ్‌గా, స్వీకరించే విధంగా ఉండండి. రాశిఫలాలు గతాన్ని వదిలేయాలని, ప్రతికూల భావోద్వేగాలు లేదా అనుభవాలను వదిలివేయమని సూచిస్తోంది. ఇలా చేయడం ద్వారా, మీరు మీ జీవితంలో స్పష్టత, కొత్త ఉద్దేశ్యంతో ముందుకు సాగగలరు. మేషం: మీ ప్రేమ జీవితంలో ఆనందం, సామరస్యం ఉంటుంది. ఇద్దరు భాగస్వాములకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. మీ కెరీర్ లేదా ఆర్థిక పరంగా, అభివృద్ధి దశలోకి ప్రవేశిస్తున్నారు. విజయం అందుకుంటారు, మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండటం, అంకితభావంతో ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం స్థితిస్థాపకత, బలం అవసరం. అడ్డంకులు ఎదురైనా, బలంగా ఉండటం, ముందుకు సాగడం ముఖ్యం. అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు ఇండిగో. నెమలి ఈక అదృష్ట సంకేతం. వృషభం: మీరు కొత్త రిలేషన్‌ పెంపొందించుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయవచ్చు. ప్రియమైనవారితో మీ భావోద్వేగ బంధాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. సంపద, సమృద్ధి పొందుతారు. కెరీర్‌లో ఆర్థిక విజయాన్ని అందుకుంటారు. ఖర్చు చేసే అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి, తెలివైన పెట్టుబడులు పెట్టండి. జీవితంలో బ్యాలెన్స్‌ కనుగొనడం చాలా ముఖ్యం. శారీరక, మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన దినచర్యను ఏర్పాటు చేసుకోండి. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పింక్. రుద్రాక్ష పూసతో పూజించడం అదృష్టం కలిగిస్తుంది. మిథునం: రిలేషన్‌లో కమ్యూనికేషన్ ప్రధానం. మీతో, ఇతరులతో నిజాయితీగా, ఓపెన్‌గా మాట్లాడండి. రొమాంటిక్‌ పార్ట్‌నర్‌తో లోతైన, అర్థవంతమైన రిలేషన్‌కి అవకాశం ఉంది. మీ కెరీర్‌లో, కొత్త అవకాశాలు, ఆలోచనలు ఉద్భవించవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, తెలివైన పెట్టుబడులు పెట్టాలి. కొత్త గమ్యస్థానాలు లేదా స్థానిక ప్రాంతాలను అన్వేషించడం ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఏర్పరుచుకోండి. రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం మంచిది. అదృష్ట సంఖ్య 22, అదృష్ట రంగు గోధుమ. సోలో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే అదృష్టాన్ని పొందవచ్చు. కర్కాటకం: మీరు ప్రేమ, రిలేషన్‌కి సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇది కొత్త సంబంధాన్ని, ఇప్పటికే ఉన్న రిలేషన్‌లో కొత్త మలుపు, ప్రేమలో సెల్ఫ్‌ డిస్కవరీ జర్నీ కావచ్చు. మీ కెరీర్‌లో సమృద్ధిని పొందుతారు. పార్ట్‌నర్‌షిప్‌ ప్రతిఫలాలు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న సహాయక సంబంధాలు మీ శ్రేయస్సు కోసం ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణం కొత్త దృక్పథాన్ని పొందడానికి, కొత్త వ్యక్తులు, అనుభవాలతో కనెక్ట్ కావడానికి అవకాశాలను అందించవచ్చు. అదృష్ట సంఖ్య 47, అదృష్ట రంగు వెండి. కొత్త పరిచయాలు అదృష్టాన్ని సూచిస్తాయి. సింహం: మీ రిలేషన్‌షిప్‌ అభివృద్ధి చెందుతుంది. మీ భాగస్వామితో స్పష్టమైన, నిజాయితీతో కూడిన కన్వర్జేషన్‌ అవసరం. మీ కెరీర్‌లో ఊహించని అవకాశాలను అందుకుంటారు. మీ పనులలో పట్టుదల, సహనం పాటించాలి. ప్రయాణం ఉద్యోగ సంబంధిత అవకాశాలు, ప్రయోజనాలను తీసుకురావచ్చు. ఆరోగ్యం కోసం సరైన స్థలం లేదా మాధ్యమాన్ని కనుగొనండి. పరిసరాల్లో చిన్న చిన్న దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ అదృష్ట సంఖ్య 95, అదృష్ట రంగు బ్లూ. మీ డెస్క్‌పై టేబుల్ క్యాలెండర్ ఉంచడం అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. కన్య: మీకు భాగస్వామ్యం, సమతుల్యత కీలకం. రిలేషన్‌లో సామరస్యం ఉంటుంది. ఇతరుల మధ్య వివాదాలకు మధ్యవర్తిత్వం వహించడానికి మిమ్మల్ని పిలవవచ్చు. గత పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. బ్యాలెన్స్‌ కనుగొనడానికి సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, ఆత్మపరిశీలన సహాయపడుతాయి. ఆధ్యాత్మిక అభ్యాసాలలో పాల్గొనడం లేదా ఆధ్యాత్మిక అన్వేషకులు లేదా గురువులతో కనెక్ట్ అవ్వడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ అదృష్ట సంఖ్య 34, అదృష్ట రంగు పీచ్. ఫాన్సీ లాంప్‌షేడ్‌ను చూడటం అదృష్టం కలిగిస్తుంది. తుల: క్షమాపణ, కరుణ, సెల్ఫ్‌ లవ్‌ని ప్రోత్సహిస్తూ మీరు ప్రేమ, రిలేషన్‌కి మీ హృదయాన్ని తెరుస్తారు. కృతజ్ఞతపై దృష్టి పెట్టడం, మీకు సహకరించడానికి విశ్వంపై నమ్మకం ఉంచడం మంచిది. ఆర్థిక భద్రత, కెరీర్ అవకాశాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక మార్గదర్శకులు, దేవదూతల మద్దతుతో మానసిక, శారీరక ఆరోగ్యం కోసం హీలింగ్‌, గైడెన్స్‌ కోరాలి. రిస్క్‌లు తీసుకోండి, మీ కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టండి. సాహసోపేతంగా, ప్రపంచం గురించి ఆసక్తిగా అనిపిస్తుంది. అదృష్ట సంఖ్య 58, అదృష్ట రంగు లిలక్. అబ్‌స్ట్రాక్ట్‌ ఆర్ట్‌ని చూడటం అదృష్టం తెస్తుంది. వృశ్చికం: లోతైన, అర్థవంతమైన కనెక్షన్ల కోసం విధేయత, నమ్మకాన్ని సూచిస్తూ బలమైన, సహాయక స్నేహాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి మెంటర్‌షిప్ లేదా విద్య ద్వారా జ్ఞానం, మార్గదర్శకత్వం కోరాలి. విజయాన్ని సాధించడానికి ఇతరుల నుంచి నేర్చుకోవడం, ఆలోచనలు, భావోద్వేగాలను పర్యవేక్షించడం ముఖ్యం. మానసిక, శారీరక శ్రేయస్సును ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, కొత్త అనుభవాలను వెతకడం వ్యక్తిగత వృద్ధికి దారితీయవచ్చు. మీ అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు సియాన్. పూల డిజైన్ చూడటం అదృష్టం కలిగిస్తుంది. ధనుస్సు: వినూత్న, సృజనాత్మక పనిపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో భావోద్వేగ బంధాలను మరింతగా పెంచుకోవడానికి ఓపెన్‌, వల్నెరబుల్‌గా ఉండాలి. విజయానికి కొత్త అవకాశాలను వెతకడానికి వినూత్నంగా ఆలోచించండి. వ్యక్తిగత ఎదుగుదల, పరివర్తన కోసం మనసు చేసే సూచనలు అనుసరించండి. తెలియని వాటిని ఎక్స్‌ప్లోర్‌ చేయడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం ఉత్సాహం తీసుకొస్తుంది. మీ అదృష్ట సంఖ్య 77, అదృష్ట రంగు కుంకుమ నారింజ. టేకువుడ్ టేబుల్ అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. మకరం: మీ ప్రస్తుత సంబంధంలో కమిట్‌మెంట్‌కి లేదా కొత్త రొమాంటిక్‌ పార్ట్‌నర్‌షిప్‌కి సిద్ధంగా ఉండాలి. మీ జీవితంలోకి సరైన వ్యక్తిని తీసుకురావడానికి ప్రేమ, విశ్వాన్ని విశ్వసించడం మంచిది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీ ఫీల్డ్‌లోని సలహాదారులు లేదా దేవదూతల నుంచి గైడెన్స్‌ కోరండి. మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించడానికి సెల్ఫ్‌ లవ్‌ ప్రాక్టీస్‌ చేయండి. ప్రయాణం విశ్రాంతి, రిఫ్రెష్‌మెంట్‌ తీసుకొస్తుంది. శారీరక, భావోద్వేగ, మానసిక శ్రేయస్సుకు సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. అదృష్ట సంఖ్య 44, అదృష్ట రంగు క్రీమ్. పెద్ద కాఫీ మగ్‌తో రోజును ప్రారంభించడం అదృష్ట సంకేతం. కుంభం: మీరు మీ రొమాంటిక్‌ రిలేషన్‌లో లోతైన విశ్వాసం, భద్రతను అనుభవిస్తూ ఉండవచ్చు, సంబంధాలు, ప్రేమ శక్తిపై విశ్వాసం కలిగి ఉండవచ్చు. మీ సామర్థ్యాలపై ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మీ కెరీర్‌లో విజయం అందుకుంటారు. స్వీయ సందేహం లేదా విశ్వాసం లేకపోవడం కొన్నిసార్లు తలెత్తవచ్చు. సెల్ప్‌ కేర్‌ నిర్లక్ష్యం చేయకండి, వ్యక్తిగత అవసరాలు, శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. విశ్రాంతి, రిఫ్రెష్‌మెంట్‌ కోసం ట్రావెల్‌ చేయండి. రొటీన్ నుంచి విరామం తీసుకోండి. మీ అదృష్ట సంఖ్య 45, అదృష్ట రంగు బ్రౌన్. మనీ ప్లాంట్‌ను చూడటం అదృష్టం కలిగిస్తుంది. మీనం: ఈ రోజు ప్రేమ, రొమాన్స్‌ హైలైట్ అవుతాయి. ఇది కొత్త సంబంధాల ఆకర్షణను సూచిస్తుంది లేదా ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేస్తుంది. మీ కెరీర్ మార్గంలోని సవాళ్లను అంతర్గత బలం, స్థితిస్థాపకతతో అధిగమించవచ్చు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవటానికి బలం, హీలింగ్‌, పరివర్తనను కనుగొనే సామర్థ్యం అవసరం. సాహసాలను ప్లాన్ చేయడం, ప్రయాణం ద్వారా తెలియని వాటిని స్వీకరించడం కొత్త అభ్యాసం, దృక్పథాన్ని అందిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 55, అదృష్ట రంగు డార్క్‌ గ్రే. చెట్టు తీగను చూడటం అదృష్టం కలిగిస్తుంది.


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Beauty Tips: మీ ఇంట్లో టమాట ఉంటే చాలు.. ముఖానికి సూపర్ ఫేస్ ప్యాక్ రెడీ

Tomato Face Pack : ఎండల కారణంగా మన శరీరంతో డీ-హైడ్రేట్ అవ్వడంతో పాటు.. మన ముఖం కూడా పాడైపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన ముఖంలోని కాంతిని తిరిగి తీసుకురావడానికి.. మన ఇంట్లోనే ఒక అద్భుతమైన ఔషధం ఉంది అని మీకు తెలుసా?


14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను...


పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్

పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్ స్కూల్ కు వెళ్లేటప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఇష్టం వచ్చిన వంటలు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెడుతారు.   గుడ్డు, చికెన్, మటన్ ఇలా ఫిష్ రకరకాల వంటు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తారు. అయితే  రాజస్థాన్ లో లేటెస్ట్ గా  స్కూల్ పిల్లలకు  గుడ్లు, నాన్ వెజ్ టిఫిన్ బాక్సుల్లో  ప...


మహిళల ఆరోగ్యానికి ఇవి రక్షణ కవచం.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు

Women Health: మనకు లభించే వివిధ రకాల మూలికలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అతి పురాతన మూలికగా పేరున్న మెంతులతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఐరన్(Iron), మెగ్నీషియం(Magnesium), మాంగనీస్‌(Manganese), ఫైబర్(Fiber), విటమిన్లకు ఇవి నిలయం. వీటితో మహిళల పీరియడ్ ప్రాబ్లమ్స్ దూరమై, మెన్‌స్ట్రువల్ హెల్త్ మెరుగుపడుతుంది. PCOS వంటి అనారోగ్యాలకు సైతం...


Ketu Gochar 2024: అంతుచిక్కని కేతువు ఈ రాశులవారిపై వరాల జల్లు! మీ రాశి కూడా ఉందా?

Ketu Gochar 2024: కేతువు గ్రహం సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వస్తున్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


నెల రోజులు ఉల్లిపాయలు తినకపోతే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోవాల్సిందే

[caption id="attachment_2466514" align="alignnone" width="1200"] Onion: వేసవి సీజన్ లో ఎండలతో మనుషులు ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయలు అవసరమా? ఉల్లిపాయ లేకుండా వంట రుచిగా ఉండదు. ఉల్లిపాయలను వంటలో ఉపయోగించడం వల్ల రుచితో పాటు మంచి మేలు జరుగుతుంది. ఒక నెల పాటు మీ ఆహారంలో ఉల్లిపాయలను వాడకపోతే ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?[/caption] ఉల్లిపాయ ఒక భూమిలోంచి వచ్చే ఓ కూరగాయ. ఉల్లిపాయ పురాతన కూరగాయలలో ఒకటి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు లేదా వేయించినప్పుడు ఒక రసాయనం ఉత్పత్తి అవుతుంది.ఇందులో ఉండే క్వెర్సెటిన్ అనే రసాయనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి మానవ ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపుతుంది. మానవ శరీరానికి అవసరమైన పోషకాలు ఉల్లిపాయల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోకపోతే శరీరంలో అనేక లోపాలు వస్తాయి. ఉల్లిపాయ నుండి లభించే విటమిన్ సి, బి6 మరియు ఫోలేట్ ఉల్లిపాయను తినకపోతే ఏ శరీరానికి చేరదు. అంతే కాకుండా మెగ్నీషియం, పొటాషియం కూడా లభించవు. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సీనియర్ డైటీషియన్ స్వాతి మాట్లాడుతూ లక్షణాలు పెరిగే కొద్దీ రక్తం గడ్డకట్టడం, ఎర్రరక్తకణాలు ఏర్పడటం సమస్యాత్మకంగా మారుతుందన్నారు. ఉల్లిపాయ మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే కూరగాయ. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత ముఖ్యమైనది. ఉల్లిని పూర్తిగా మానేయడం వల్ల మంచి ఆరోగ్యం లభించదు మరియు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కూరగాయలతో పాటు ఉల్లిపాయలు తినడం కూడా సమతుల్య ఆహారంలో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయను రాసేటప్పుడు కళ్లలో నీళ్లు రావడం మామూలే. ఉల్లిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని సీనియర్ డైటీషియన్ స్వాతి తెలిపారు. ఉల్లిపాయలో విటమిన్ సి, బి6 మరియు ఫోలేట్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల మరియు జీవక్రియలో సహాయపడతాయి. ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్(allyl propyl disulfide) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది వాపు మరియు క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. ఇలా పీచు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పీచు అందదు. దీనివల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్( (allyl propyl disulfide)) వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది వాపు మరియు క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. ఇలా పీచు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను తీసుకోకపోతే శరీరానికి కావాల్సిన పీచు అందదు. దీనివల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లమేటరీ లక్షణాలను నియంత్రించే శక్తి ఉల్లిపాయకు ఉంది. ఉల్లిపాయల్లోని అల్లిసిన్ (allicin) , క్వెర్సెటిన్ (quercetin)మంటను తగ్గిస్తాయి. ఉల్లిపాయను తినకపోతే, ఈ సమస్య రోజురోజుకు పెరిగి దీర్ఘకాలిక వ్యాధిగా మారే ప్రమాదం ఉంది.


Danger Things: ఈ ఆరు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా..? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!

మనం నిత్యం ఇంట్లో ఎన్నో రకాల ఉత్పత్తులను వినియోగిస్తుంటాం. అయితే కొన్ని వస్తువులు చాలా ప్రమాదకరమైనవి. వాటి గురించి తెలియక వాటిని చాలా నిర్లక్షంతో వాడుతుంటాము. కానీ అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. ఉదయం నుంచి బిజీగజిబిగా ఆఫీస్ లో డిపేవారు.. తమ విధులు పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇల్లు మనకు ఎప్పుడూ సురక్షితమైన ప్రదేశం కాబట్టి. అయితే ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం అంటున్నారు.. తమిళనాడు గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు వెంకటకృష్ణన్. అరోమా డిఫ్యూజర్స్: మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నా, లేకపోయినా ఇంట్లోకి అడుగుపెట్టగానే సుఖంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి మార్కెట్లో విక్రయించే వివిధ రకాల ఎయిర్ ఫ్రెషనర్లను కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇది విషపూరితం కాకపోయినా.. ఆస్తమా వంటి వివిధ శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఎయిర్ ఫ్రెషనర్లకు బదులుగా, మీరు సుగంధ నూనెలను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా.. ఇంటిని బాగా వెంటిలేషన్ చేయడం ద్వారా, మీరు చెడు వాసనలను నివారించవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్లు : నాన్ స్టిక్ ప్యాన్లను వేడి చేసినప్పుడు, వాటిలో పూసిన రసాయన సమ్మేళనాలు విష వాయువులను విడుదల చేస్తాయి. అవి క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంతేకాకుండా అంతర్గత అవయవాల వైఫల్యానికి దారితీస్తాయి. అందువల్ల, సిరామిక్, ఎప్పుడూ ఇత్తడి, కాస్ట్ ఇనుప పాత్రలు ఉపయోగించడం మంచిది. క్లీనింగ్ ప్రొడక్ట్స్: మన ఇళ్లు, పాత్రలు మరియు బట్టలు శుభ్రం చేయడానికి మనం కొనుగోలు చేసే చాలా ఉత్పత్తులలో అమ్మోనియా, బ్లీచ్ వంటి కఠినమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం, కంటికి హాని కలిగించవచ్చు. అంతేకాదు దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి. ప్రత్యామ్నాయంగా, మీరు వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మరసం మొదలైన వాటిని ఉపయోగించి శుభ్రం చేయడం మంచిది. పురుగుమందులు: పురుగుమందులలో తీవ్రమైన రసాయనాలు ఉంటాయి, ఇవి తలనొప్పి, తల తిరగడం, నరాల సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల వీటి వినియోగానికి దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులు ఇతర పద్ధతులపై దృష్టి పెట్టడం మంచిది. ప్లాస్టిక్ కంటైనర్లు: ఆహారాన్ని నిల్వ చేయడానికి, లంచ్ బాక్సులుగా ఇటీవల చాలా మంది ప్లాస్టిక్ బాక్సులు ఉపయోగిస్తున్నారు. దీనిని వీలైనంత త్వరగా మానుకోవాలి. స్టీల్ బాక్సుల వాడకం అన్ని విధాల చాలా మంచిది. ఎందుకంటే.. వాటిలోని రసాయనాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. ముఖ్యంగా వేడి వేడి వస్తువులు అందులో వేసినప్పుడు ఆ రసాయనాలు ఆహారంలో కలిసి కడుపులోకి వెళ్తాయి ఇది క్యాన్సర్ కు కారణం అయ్యే ప్రమాదం ఉంది. డ్రైయర్ షీట్లు: వాషింగ్ మెషీన్లలో డ్రైయర్ షీట్లను ఉపయోగించడం వల్ల వాటి నుండి వెలువడే విషపూరిత పొగ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యామ్నాయంగా ఉన్ని యొక్క పొడి బట్టను ఉపయోగించండి.


175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా?

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు.అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలుతో 2021 సంవత్సరంలో నిర్మాణం...


ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా...


ఉదయం లేదా సాయంత్రం.. ఫ్రూట్స్ ఎప్పుడు తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు?

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పండ్ల నుండి శరీరానికి అవసరమైన ప్రతి విటమిన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి లభిస్తాయి. మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో, వాటిని పండ్ల నుంచి సులభంగా పొందుతాం. అందుకే రోజూ కనీసం ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) కానీ తరచుగా మనం పండ్లు తినేటప్పుడు మూడు పెద్ద తప్పులు చేస్తుంటాం. ఈ పొరపాట్లు పండ్ల నుండి మనకు లభించే పోషకాలను తగ్గించడమే కాకుండా, పండ్ల నుండి మనం పొందవలసిన ప్రయోజనాలను కూడా పొందలేము. ఆ 3 తప్పులు ఏమిటో పోషకాహార నిపుణుడి నుండి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) 1.ఆహారంతో కలపడం : ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా మాట్లాడుతూ.. మనం తరచుగా సలాడ్‌లో పండ్లను తయారు చేసి, వాటిని ఏదైనా భోజనంలో కలుపుకుని తింటుంటాం. చాలా సార్లు మనం లంచ్ లేదా డిన్నర్ తో పాటు పండ్లు తింటాము. కానీ ఇలా పండ్లు తినడం సరైన పద్ధతి కాదు. బదులుగా, మీరు ఎల్లప్పుడూ పండ్లను మాత్రమే తినాలి. ఆహారంతో కలిపి వాటిని తీసుకోకూడదంట. నిజానికి పండ్లు వాటికవే పూర్తి ఆహారం. అందుచేత వీటిని మరే ఇతర ఆహారంలో కలిపి తినకూడదు.(ప్రతీకాత్మక చిత్రం) 2.పండ్లు తినండి, వాటిని త్రాగవద్దు: పండ్లను నేరుగా తినడానికి బదులు దాని రసం తీసి తాగడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఆరెంజ్ లేదా యాపిల్ జ్యూస్ తాగడం చాలామందికి ఇష్టం. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి, మనం పండ్ల రసాన్ని తీసినప్పుడల్లా, రసాన్ని తీయడానికి మొదటిది ఎక్కువ పండ్లు అవసరమౌతాయి. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. రెండవది, పండ్ల రసం నుండి మనకు పోషకాలు లభించినప్పటికీ, పండ్ల గుజ్జులో మిగిలి ఉన్న ఫైబర్ మనకు లభించదు.(ప్రతీకాత్మక చిత్రం) 3. సాయంత్రం 5 గంటలలోపు పండ్లు తినండి : పండ్లు తినడానికి ఇదే సరైన సమయం అని డాక్టర్ శ్వేతా షా చెప్పారు. సాయంత్రం 5 గంటలలోపు ఏదైనా పండు తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి పండులో చక్కెర కంటెంట్ ఉంటుంది, ఇది మీ ఇన్సులిన్‌ను పెంచుతుంది. మీరు ఇలా చేస్తే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.(ప్రతీకాత్మక చిత్రం)


శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహా...


Today Panchangam 04 May 2024 ఈరోజు వరూథిని ఏకాదశి వేళ ఉపవాస దీక్ష, పూజకు శుభ ముహుర్తాలు ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని ఏకాదశి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


గ్రహాలు మీకెంత వ్యతిరేకంగా ఉన్నా ఈ గుడికి వెలితే మీరు కోరుకున్నది జరగాల్సిందే!

శ్రీకాకుళంలో బలగ నాగావళి నది ఒడ్డున శ్రీ బలాత్రిపుర సుందరి కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 2020 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుండి శ్రీ బలా త్రిపుర సుందరి అమ్మవారు, కాలభైరవ స్వామి ఇక్కడ పూజలు ఆందుకుంటున్నారు. అంతే కాకుండా ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి , శ్రీ సుభ్రమణ్యస్వామి. శ్రీ అంజనేయ స్వామి వారు కూడా పూజలు ఆందుకుంటున్నారు. ఈ కాలభైరవ స్వామిని గ్రహ దోషాలు ఉండే వారు సందర్శించి పూజిస్తే దోష విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారు. భైరవ అంటే ఎవరిని చూస్తే భయం వేస్తోందో ఎవరినీ చూస్తే హడలిపోతామో వారే కాలభైరవ స్వామి అంటారు. ఆదివారం స్వర్ణకర్షణ కాల భైరవ స్వామి భాషణ్మాభిషేకం జరుగుతుంది. నరికేల, నిమ్మడిప్పలు, కూష్మాండ దీపాలతో హారతి ఇస్తారు. ఈ ఆలయంలో ఒక్కో రోజు ఒకో పూజా విధానం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ ఏ రోజు ఎలాంటివి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం బాణా శివలింగానికి లఘు రుధారభిషేకం జరుగును. మంగళవారం వళ్ళి దేవా సేన సహిత సుబ్రమణ్య స్వామికి ఇష్టమైన భస్మభిషేకం చేస్తారు. అలాగే విశేష అలంకరణ ద్వాదశ హారతి సేవ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. బుధవారం లక్ష్మీ గణపతికి చందనాభిషేకం నిర్వహిస్తారు. అలాగే అలంకరణ యంత్ర సేవ ద్వాదశ హారతి సేవ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురువారం దత్తాత్రేయుడికి అభిషేకం ఉంటుంది. అటుపైన అలంకరణ భక్తులచే సామూహిక అనగా దేవి వ్రతం చేయించడం సాయంత్రం స్తోత్ర పారాయణం జరుగును. శుక్రవారం బాలా త్రిపుర సుందరీ దేవికి కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేష అభిషేకం జరుగును. సాయంత్రం స్తోత్ర పారాయణం మరియు ద్వాదశ హారతి సేవ జరుగును. శనివారం అభయాంజనేయ స్వామికి విశేషంగా సింధూర అభిషేకం జరుగును. తమలపాకుల అర్చన జరుపబడును సాయంత్రం స్తోత్ర పారాయణం, ద్వాదశ హారతి సేవ జరుగును.


Lemon Hot Water: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


అరచేతులు, పాదాలపై జుట్టు ఎందుకు పెరగదు.? అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు..!

మనం నిత్యం చూస్తున్నా కొన్ని కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోము. అసలు అలా ఎందుకు ఉంటుంది.. దానికి కారణం ఏంటి అన్నవి పంట్టించుకోము. అయితే పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మన శరీరం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలా ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన శరీరం యొక్క బయటి భాగం చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇక శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అయితే మీ అరచేతులు, పాదాలను జాగ్రత్తగా చూసుకోండి. అయితే వాటిమీద వెంట్రుకలు కనిపించవు.. దీనికి కారణం మీకు తెలుసా.. ఇక్కడ సమాధానం ఉంది చూడండి. శాస్త్రీయ పరిశోధన ప్రకారం, శరీరంలో Wnt అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో జుట్టు పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది. కానీ అరచేతులు మరియు పాదాలకు జుట్టు పెరగదు. శరీరంలోని మరో ప్రత్యేక ప్రోటీన్ అరచేతులు మరియు అరికాళ్ళపై వెంట్రుకలు పెరగకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలను నిరోధించే ఈ నిర్దిష్ట నిరోధక ప్రోటీన్ డైకాఫ్ 2 (DKK2) అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిరోధక ప్రోటీన్ Wnt అరికాళ్లు మరియు అరచేతులకు చేరకుండా నిరోధిస్తుంది. దీని వల్ల పాదాలు, అరచేతులపై వెంట్రుకలు పెరగవు. Wnt ప్రొటీన్ వల్ల మనుషులతోపాటు జంతువులలో జుట్టు పెరుగుతుంది. ఇది జంతువు యొక్క నిర్దిష్ట జీవనశైలి, పర్యావరణం మరియు కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో కనిపించే జంతువులు సాధారణంగా ఎక్కువ జుట్టు కలిగి ఉంటాయి. ఈ జంతువుల శరీరం జుట్టు లేదా బొచ్చుతో కప్పబడి ఉంటుంది. ఈ రకమైన మందపాటి జుట్టు చలి నుండి జంతువులను రక్షిస్తుంది. శరీర జుట్టు సూర్యుడు, చలి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈరోజు తలపై జుట్టు అందాన్ని సూచిస్తుంది. జుట్టు రాలే సమస్య మనుషుల్లో కూడా వస్తుంది. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో కనిపిస్తుంది.


బ్లాక్ డ్రెస్సులో టాప్ లేపేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. శ్రియ శరణ్ స్కిన్ షో అదుర్స్

టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు నెటిజన్లుకు.(Photo:Instagram) ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో కూడా స్వీట్ సిక్స్ టీన్ లా తన జీరో సైజ్ ఫిజిక్ చూపిస్తూ కుర్రాళ్ల ను కట్టిపడేస్తోంది. అంగాంగ ప్రదర్శన చేస్తూ అందాలు ఆరబోస్తున్న ఈ హాట్ లేడీ బోల్డ్ లుక్స్ చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.(Photo:Instagram) ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థైస్ కనిపించేలా హాఫ్ కట్ బ్లాక్ డ్రెస్సులో టాప్ కవర్ చేస్తూ డౌన్ చూపిస్తూ టెంపరేచర్ పెంచుతోంది ముద్దుగుమ్మ. (Photo:Instagram) ఈసుందరాంగి సొగసులు, సౌందర్యం చూసి కుర్రాళ్లు కళ్లు తేలేస్తున్నారు. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన, అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది. సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు. (Photo:Instagram) శ్రియ పైట చాటున ఉన్న పరువాలు చూపిస్తూ కుర్రాళ్లనే కాదు నెటిజన్ల చూపుల్ని కూడా తనవైపు తిప్పుకుంటోంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్న శ్రియ అన్నీ విషయాల్లో బోల్డ్ గా ఉంటుంది. (Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను చూపులు తిప్పుకోనివ్వడం లేదు. స్లిమ్ ఫిజిక్ తో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్టైల్లో అందాలు ఆరబోస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా శ్రియ బిజీగా మారిపోయింది..(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సులో టెంప్ట్ చేసే విధంగా ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలకు నెటిజన్లు ఐ లవ్ యు శ్రియ అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు నెటిజన్లు.అయితే నిజంగా అజంత శిల్పంగా కనిపిస్తోంది శ్రియ శరణ్ .(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సునామీ సృష్టిస్తున్నాయి. ఈ అమ్మడి సోకులు, సొగసులు వర్ణించలేక నెటిజన్లు దేవత, గార్జియస్, క్వీన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే వయసు దాచుకోని ఈముద్దుగుమ్మ తన కూతురిని ఎత్తుకొని కూడా కొన్ని ఫోటోషూట్ లు చేసింది. (Photo:Instagram)


చిన్న సబ్బు ముక్కతో బొద్దింకలను తరిమి కొట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

బొద్దింకలను ఇంట్లో నుంచి సమూలంగా నిర్మూలించాలి. చాలా మంది ఈ బొద్దింకలను వదిలించుకోవడం కోసం మార్కెట్లో లభించే కెమికల్స్ తో ఉండే స్ప్రేలను వాడుతూ ఉంటారు. అయితే... వాటి వల్ల బొద్దింకలు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ ఎక్కువగా వచ్చేస్తూనే ఉంటాయి మనం మన వంట గదిని తరచూ శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. అయితే... మనం ఎంత శుభ్రం చేసినా కూడా ఇంట్లో బొద్దింకలు వస్తూనే ఉంటాయి. ఒక్కటి పుట్టుకొస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లోగా అవి వందలుగా, మందలుగా పెరిగిపోతాయి. ఒక్కసారి...


పిల్లలకు కూచిపూడి నేర్పించాలనుకునే వారికి గుడ్ న్యూస్..

స్పష్టమైన కేశంకలరణ, ఆకర్షణీయమైన కదలికలు, వేగవంతమైన ఫుట్ వర్క్ విలక్షణమైన లక్షణం, స్వచ్చమైన నృత్యం, నాటకీయ కలయికతో కథను చెప్పే తెలుగు రాష్ట్రంలో పుట్టిన భారతీయ నృత్య రూపం కూచిపూడి నాట్యం. ఈ మధ్య వేదికల పైన చిన్నారుల నాట్యం చూస్తుంటే మన పిల్లలకి కూడా నేర్పించాలి అనే ఆలోచనలో వెళ్తుంటాం కదా అయితే మీ పిల్లలకు కూచిపూడి నేర్పించాలి అనుకుంటున్నారా.. కూచిపూడి నాట్యంలోఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఇన్స్టిట్యూట్ మీకు పరిచయం చేస్తాం. ఇక్కడ మీ పిల్లలను చేర్పించి...


Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Saturday Motivation: చిన్నచిన్న సమస్యలు రాగానే తల్లడిల్లిపోవద్దు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది.. అని మనసులో అనుకోండి. సమస్యలను చూసి బెదిరిపోతే ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఇంకేమీ దక్కదు.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.


చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుందా? ఇలా చేయండి!

తెల్ల జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. ఇక్కడ చెప్పిన సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు నల్లగా నిగారిస్తుంది.


Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి..

Gray Hair Problems: వెంట్రుకలు తెల్లబడటం సమస్య ఈ కాలంలో అందరిని వేధిస్తుంది చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి కొన్ని రకాల టిప్స్ పాటిస్తే వెంట్రుకలు తెల్లబడకుండా మనం నివారించవచ్చు.


శరీరంలో ఐరన్ లోపం ఉందా!.. ఈ రెండు తినండి చాలు..

శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందాలి. అలాంటి వాటిలో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని ఐరన్ ప్రొటీన్‌గా పేర్కొంటారు. ఇది రక్తం నుంచి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు...


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.


వేసవిలో సోరకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో దీనిని తినమని చెబుతారు. ఇలాంటి సోరకాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం.